
శనివారం బంజారాహిల్స్ లోని ఫుడింగ్ మింక్ పబ్ ఫై పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పెద్ద ఎత్తున సినీ , రాజకీయ ,వ్యాపార రంగాలకు చెందినవారు దొరికారు. వీరిలో నాగబాబు కూతురు నిహారిక తో పాటు బిగ్ బాస్ విన్నర్ , సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా రాత్రి పబ్ లో దొరికారు. ఈ క్రమంలో మీడియా తో రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడారు. అసలు రాహుల్ పార్టీకి ఎందుకు వచ్చారు.?. పబ్‌లో రాత్రి అసలేం జరిగింది..? అనేది బయటకు చెప్పారు.
తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉండటంతోనే తాను పబ్‌కు వెళ్లానని రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. అయితే డ్రగ్స్ తీసుకున్నారా అని అడిగా మీడియా ప్రతినిధులకు అసలు తనకు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదని రాహుల్ సమాధానం ఇచ్చాడు. ఒకవేళ నిజంగా డ్రగ్స్ తీసుకుంటే ఇప్పుడు ఇంట్లో ఎందుకు కూర్చుంటానని కూడా రాహుల్ ప్రశ్నించాడు. అడ్డంగా దొరికిపోయారు అంటూ సోషల్ మీడియాలో తమను టార్గెట్ చేస్తూ ప్రచారం చేయడం తగదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు.