Homeటాప్ స్టోరీస్మరోసారి తన పెద్ద మనసును చాటుకున్న లారెన్స్

మరోసారి తన పెద్ద మనసును చాటుకున్న లారెన్స్

మరోసారి తన పెద్ద మనసును చాటుకున్న లారెన్స్
మరోసారి తన పెద్ద మనసును చాటుకున్న లారెన్స్

సహాయం విషయంలో రాఘవ లారెన్స్ ఎప్పుడూ పెద్ద మనసే. సందర్భం ఏం లేకపోయినా కానీ తన వంతుగా తన బాధ్యతగా ఎంతో మందిని చదివిస్తున్నాడు. ఎన్నో కుటుంబాలను చూస్తున్నాడు. తన తల్లి పేరు మీద ఇప్పటికే ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసాడు లారెన్స్. అలాంటిది కరోనా కారణంగా ప్రజలు అల్లాడుతున్న వేళ లారెన్స్ స్పందించకుండా ఉంటాడా. తన తర్వాతి సినిమాకు వచ్చిన అడ్వాన్స్ ను మొత్తాన్ని కరోనా సహాయ నిధి కోసం వాడుకుంటున్నట్లు ప్రకటించాడు లారెన్స్. ఇంతకు ముందే ఈ ప్రకటన చేసిన లారెన్స్ ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టాడు.

స్వతహాగా నృత్య కళాకారుడు అయిన లారెన్స్, తన తోటి పేద నృత్య కళాకారులకు సహాయం చేయడానికి నడుం బిగించాడు. హైదరాబాద్ లో 10 మందికి, చెన్నైలో 13 మందికి మనిషికి 25,000 చొప్పున మొత్తం 5 లక్షల 75 వేల రూపాయలను డైరెక్ట్ గా వారి వారి అకౌంట్లలో జమయ్యేలా చూసాడు లారెన్స్. డ్యాన్స్ నే నమ్ముకుని ప్రస్తుతం కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడం నా బాధ్యతగా భావించాను. అందుకే ఇబ్బందులు పడుతున్న 23 మందిని గుర్తించి వారికి సహాయం అందేలా చేశాను.  గతంలో ప్రామిస్ చేసిన అమౌంట్ ను కూడా విరాళంగా అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాను అని తెలిపాడు లారెన్స్.

- Advertisement -

తాను ఎదిగిన నృత్య రంగంలో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి సహాయం చేయడంతో లారెన్స్ పెద్ద మనసు మరోసారి చాటిచెప్పినట్లు అయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All