Homeటాప్ స్టోరీస్లారెన్స్ కొంప మునుగుతుందా ?

లారెన్స్ కొంప మునుగుతుందా ?

రాఘవ లారెన్స్ 2007 లో ”ముని ” టైటిల్ తో తమిళ్ లో సినిమా తీసాడు . హర్రర్ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది . దాంతో దానికి సీక్వెల్ గా ముని 2 గా కాంచన అనే చిత్రాన్ని చేసాడు 2011 లో అది కూడా పెద్ద హిట్ దాంతో 2015 లో గంగ అనే హర్రర్ చిత్రం చేసాడు అది కూడా సూపర్ హిట్ ఇంకేముంది ఇప్పుడు ముని 4 కాంచన 3 అంటూ మరో హర్రర్ చిత్రం చేసాడు . అది రేపు తెలుగు , తమిళ బాషలలో విడుదల కానుంది .

- Advertisement -

హర్రర్ నేపథ్యంలో వచ్చిన మూడు చిత్రాలు కూడా సూపర్ హిట్ కావడంతో ఓవర్ కాన్ఫిడెన్స్ తో భారీ బడ్జెట్ తో ఈసారి కాంచన 3 చేసాడు . హర్రర్ నేపథ్యంలో వస్తున్న చిత్రాలు కాసుల వర్షం కురిపిస్తుండటంతో కాంచన 3 కి బడ్జెట్ ఇంకా పెంచారు . అయితే ఈసారి కూడా హిట్ కొట్టి ఆ సిరీస్ ని పది చిత్రాల వరకు కొనసాగిస్తా అని ధీమాగా చెబుతున్నాడు లారెన్స్ . అయితే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ కొంతమంది దుమ్మెత్తి పోస్తున్నారు . కాంచన 3 హిట్ అయితే ఫరవాలేదు కానీ లారెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కాంచన 3 ప్లాప్ అయితే ఆ సిరీస్ చిత్రాలకు బ్రేక్ పడినట్లే అవుతుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All