Homeటాప్ స్టోరీస్పేదల కోసం యాభై ఇండ్లు కట్టించనున్న లారెన్స్

పేదల కోసం యాభై ఇండ్లు కట్టించనున్న లారెన్స్

Raghava lawrence announced 50 houses for gaja cyclone victims తమిళనాట గజ తుఫాన్ తో 7 జిల్లాలు ఘోరంగా దెబ్బతిన్నాయి , అలాగే 60 మంది వరకు చనిపోయారు కూడా . వేలాదిమంది నిరాశ్రయులయ్యారు దాంతో పెద్ద ఎత్తున తమిళ చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చి విరాళాలు అందించింది . హీరోలు , దర్శకులు , నిర్మాతలు , ఇతర నటులు అందరూ స్పందించి తమకు తోచినంత సహాయం చేస్తూనే ఉన్నారు . అయితే లారెన్స్ మాత్రం అప్పుడు స్పందించలేదు కానీ ఇప్పుడు తన వంతు వచ్చింది కాబోలు బాధ్యత తీసుకొని ఓ యాభై మందికి ఇండ్లు కట్టించి ఇస్తానని ప్రకటించాడు . ముఖ్యంగా ఓ ముసలావిడ సర్వస్వం కోల్పోయి బాధపడుతున్న తీరుకి చలించిపోయిన లారెన్స్ మొదటి ఇల్లు ఆ అవ్వకే అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసాడు .

అంతేకాదు బాధితులు నన్ను సంప్రదిస్తే నాకు తోచిన విధంగా ఇండ్లు కట్టిస్తానని , అయితే యాభై మందికి కట్టించి ఇస్తానని ఇల్లు కోల్పోయిన వాళ్ళు నన్ను కలవాలని కోరాడు . డ్యాన్స్ మాస్టర్ గా , హీరోగా , దర్శకుడిగా , నిర్మాతగా లారెన్స్ బాగానే సంపాదించాడు . అలాగే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నాడు . ఇప్పుడేమో గజ తుఫాన్ బాధితుల కోసం యాభై ఇండ్ల ని కట్టించి ఇవ్వడానికి సిద్దమయ్యాడు .

- Advertisement -

English Title: Raghava lawrence announced 50 houses for gaja cyclone victims

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All