Homeటాప్ స్టోరీస్భారత్ ని తప్పుపడుతున్న పాక్ హీరోయిన్

భారత్ ని తప్పుపడుతున్న పాక్ హీరోయిన్

Raees heroine Mahira khan comments on surgical strikes 2పాకిస్థాన్ హీరోయిన్ మహీరాఖాన్ భారత్ ని తప్పుపడుతోంది . పాక్ లో సర్జికల్ స్ట్రైక్స్ 2 జరిపి భారత్ పెద్ద తప్పు చేసిందని , దీనివల్ల భారత్ – పాక్ ల  మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని , పాక్ ని రెచ్చగొట్టి యుద్దానికి కాలు దువ్విందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మహీరాఖాన్ . షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ” రాయిస్ ” చిత్రంలో హీరోయిన్ గా నటించింది మహీరాఖాన్ .

 

- Advertisement -

బాలీవుడ్ చిత్రంలో నటించిన ఈ భామ పాక్ జాతీయురాలు దాంతో తన దేశానికి వత్తాసుగా మాట్లాడుతోంది . పాకిస్థాన్ కు చెందిన భామ కాబట్టి వాళ్ళ దేశాన్ని సపోర్ట్ చేయడంలో తప్పు లేదు కానీ భారత్ లో అడ్డగోలుగా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తూ సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న ఉగ్ర వాదులను ఏమి అనడం లేదు , అలాగే ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతున్న పాక్ ప్రభుత్వాన్ని కానీ , సైన్యాన్ని కానీ పల్లెత్తు మాట అనడం లేదు మహీరాఖాన్ . ఇలాంటి వాళ్ళని మన దేశానికి తీసుకొచ్చి డబ్బులిచ్చి , నటించడానికి అవకాశాలిచ్చి పెద్ద తప్పు చేస్తున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు .

English Title : Raees heroine Mahira khan comments on surgical strikes 2

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All