Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ టాక్ : క్లాస్ ఆడియన్స్ కు మాత్రమే

రాధే శ్యామ్ టాక్ : క్లాస్ ఆడియన్స్ కు మాత్రమే

radheshyam Movie talk
radheshyam Movie talk

బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు గత రెండేళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిని మించి ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లు డైరెక్టర్ రాధాకృష్ణ చిత్రాన్ని తెరకెక్కించారా లేదా..? నిర్మాతల ఖర్చు కథ కు తగ్గవేనా..? థమన్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ అవుట్ అయ్యిందా లేదా..? గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న పూజా ఏ మేరకు ఆకట్టుకుంది..? మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చించేసాడా..లేదా..? అనేది పబ్లిక్ టాక్ లో చూద్దాం.

ఇండియాలో తెల్లవారు జామునుండే రాధే శ్యామ్ సందడి మొదలైతే..ఓవర్సీస్ లో అర్ధరాత్రి నుండి సందడి మొదలైంది. సినిమాను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. సినిమా అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ వచ్చారు. ఇక వారి అభిప్రాయం ప్రకారం..సినిమా విజువల్ గా హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఇంటర్వెల్ , క్లైమాక్స్ తెరపై అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. ప్రభాస్ – పూజా హగ్దేల కెమిస్ట్రీ సూపర్బ్, థమన్ బ్యాక్ గ్రౌండ్ అరిపించేసాడు. కాకపోతే ప్రభాస్ ను ఇంత క్లాస్ గా చూడడం తట్టుకోలేకపోతున్నారు. ప్రభాస్ నుండి యాక్షన్ కోరుకునేవారికి ఏమాత్రం నచ్చలేదు. అలాగే మాస్ ఆడియన్స్ కూడా ఇది పెద్దగా ఎక్కలేదని అర్ధమవుతుంది. క్లాస్ ఆడియన్స్ కు మాత్రం బాగా నచ్చుతుంది. ఓవరాల్ గా మాత్రం భారీ అంచనాల పెట్టుకొని థియేటర్స్ కు వెళ్తే కాస్త డిస్పాయింట్ అవుతారని చెపుతున్నారు. మరి సినిమా ఫైనల్ రిపోర్ట్ ఏంటి అనేది కాసేపట్లో తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All