Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు వసూళ్లు చేయాలో తెలుసా..?

రాధే శ్యామ్ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు వసూళ్లు చేయాలో తెలుసా..?

radhe shyam making video released
radhe shyam making video released

దాదాపు మూడేళ్లుగా డార్లింగ్ అభిమానులు , సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్స్ , మేకింగ్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయడం తో సినిమాను ఎప్పుడెప్పుడా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయ్యింది..ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు 300 కోట్ల బడ్జెట్‌తో పలు భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ మొదటి రోజు నుంచి చెపుతూ వస్తున్నారు. ఈ లెక్కన మనదేశంలో పలు భాషల్లో విడుదల చేసినప్పటికీ విడుదలైన అన్ని భాషల్లో మినిమం 200 కోట్లు రాబట్టాలి. ఆలా రాబడితేనే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నారు. అయితే అది ఒకటి , రెండు రోజుల్లోనే అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి , సాహో చిత్రాలతో నార్త్ లో ప్రభాస్ కు వీరాభిమానులు అయ్యారని..ఓ హిందీ స్టార్ సినిమా వస్తే ఎలా ఉంటుందో అంతకు రెట్టింపు రాధే శ్యామ్ విషయంలో జరుగుతుందని, ఫస్ట్ డే నే వందల కోట్లు కొట్టేయడం ఖాయం అంటున్నారు. మరి వారు చెప్పినట్లు వస్తాయా..లేదా అనేది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All