
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో మాటల్లో చెప్పలేం. ’సాహో’ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడం తో తెలుగు తో పాటు ఇతర భాషల్లోను భారీ ఆసక్తి నెలకొని ఉంది.
దీంతో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ జరిగింది. మరి డీటెయిల్స్ ఏంటో మీరే చూడండి. ఇప్పటి వరకు థియేట్రికల్ బిజినెస్ పరంగా ఈ మూవీ 200 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు.
నైజాం : 40 కోట్లు అడ్వాన్స్
ఆంధ్రా : 50 కోట్ల రేషియో
సీడెడ్ : 15 కోట్ల అడ్వాన్స్
ఏపీ అండ్ తెలంగాణ మొత్తం : 115 కోట్లు
కర్ణాటక : 15 కోట్లు ఎన్ ఆర్ ఏ
తమిళనాడు : 6 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 50 కోట్లు
కేరళ : 2 కోట్లు
ఓవర్సీస్ : 24 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్ : 200 కోట్లు జరిగినట్లు సమాచారం.