Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ సెకండ్ ట్రైలర్ లో పెద్ద పొరపాటే చేసారు

రాధే శ్యామ్ సెకండ్ ట్రైలర్ లో పెద్ద పొరపాటే చేసారు

ప్రభాస్ అభిమానులే కాదు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ సరికొత్త ట్రైలర్ విడుదలైంది. మొదటి ట్రైలర్ లో కాస్త వెలితి కనిపించిన రెండో ట్రైలర్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైలర్ లో ఓ పెద్ద పొరపాటు జరిగింది. రాధేశ్యామ్ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఇదే పాత్రలో సత్యరాజ్‌ నటించారు. తెలుగు ట్రైలర్‌లో కృష్ణంరాజు స్థానంలో సత్యరాజ్‌ని చూపించారు. ఇది గమనించిన ఫాన్స్. వరుస ట్వీట్లు చేయడంతో మేకర్స్ అప్రమత్తమయ్యారు. వెంటనే ట్రైలర్‌ను డిలీట్ చేసి.. మళ్లీ కొత్త ట్రైలర్‌ను అప్‌లోడ్ చేశారు.

- Advertisement -

‘రాధేశ్యామ్ తెలుగు ట్రైలర్‌లో పొరపాటు ఏర్పడినందుకు మేము క్షమాపణలు కోరుతున్నాము. కొత్త ట్రైలర్‌ను అప్‌లోడ్ చేసాము. ఇప్పుడే చుడండి’ అంటూ యూవీ క్రియేషన్స్ తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు- తమిళం- మలయాళం- హిందీ- కన్నడ భాషల్లో11 మార్చి 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే..’మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం… మన ఆలోచనలు కూడా ముందే రాసుంటాయి.. అంటూ ప్రభాస్ వాయిస్ తో రిలీజ్ ట్రైలర్ మొదలైంది. చెయి చూసి ఫ్యూచర్ ని.. వాయిస్ విని పాస్ట్ ని కూడా చెప్పేస్తావా?.. అని సచిన్ ఖేకేడర్ చెబుతున్న డైలాగ్ లు… ఎలా ఎప్పుడు చనిపోతాడో చెప్పనా… నాకు రెండోసారి చూసే అలవాటు లేదు.. అంటూ ప్రభాస్ చెబుతున్న తీరు ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు… అని పూజా హెగ్డే పాత్ర తో చెప్పించిన డైలాగ్ లు … ట్రైలర్ చివర్లో `ప్రేమకీ విధికీ మధ్య జరిగే యుద్ధమే .. `అంటూ దర్శక ధీరుడు రాజమౌళి అందించిన వాయిస్ ఓవర్ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేసింది.

యూరప్ నేపథ్యంలో సాగే హెరిటేజ్ పిరియాడిక్ రొమాంటిక్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ విజువల్ వండర్ గా కనువిందు చేయడం కాయంగా కనిపిస్తోంది. తాజా ట్రైలర్ లో చిత్ర కథని దాదాపుగా రివీల్ చేయడం.. విధిని ఎదరించి ప్రేమని దక్కించుకున్న యువకుడిగా ప్రభాస్ ని చూపించిన తీరు.. ఓడ మునిగిపోతుంటే అబ్బుర పరిచే స్థాయిలో ప్రభాస్ చేస్తున్న విన్యాసాలు సినిమా ఓ రేంజ్ లో వుండబోతోందనే సంకేతాల్ని అందిస్తోంది. మరి సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో తెలియాలంటే మార్చి 11 వరకు ఆగాల్సిందే.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All