
మొన్నటి వరకు ఏపీలో టీ ధరకు సమానంగా సినిమా టికెట్ ధర ఉండేది..కానీ ఇప్పుడు రాష్ట్రంలో కొత్త జీవో ప్రకటించడం తో టికెట్ ధరలు ఆకాశానికి అట్టుకున్నాయి. మాములుగా ప్రభుత్వం సూచించిన ధర కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. ఈరోజు ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కావడం తో తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. రాధేశ్యామ్ విడుదల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో టికెట్ల రేట్లకు రెక్కలొచ్చాయి.
కాకినాడలో కొందరు థియేటర్ల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా టికెట్ రేట్లను పెంచేశారు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అంటూ భారీగా ధరలు పెంచారు. దీంతో సామాన్యలు టికెట్లు కొనలేని పరిస్థితి. అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక జగ్గంపేట థియేటర్లలో అయితే టికెట్ రూ.200 నుంచి రూ. 380 రూపాయలు పలుకుతోంది. కొంతమంది వీటిని కొనుగోలు చేస్తుంటే..మరికొంతమంది మాత్రం థియేటర్ యాజమాన్యం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క మూడేళ్ల తర్వాత తమ అభిమాన హీరో సినిమా రావడంతో అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రాధేశ్యామ్ సినిమా కటౌట్లు ఏర్పాటు చేసి, డప్పులు వాయిస్తూ, బాణ సంచా కాలూస్తూ రచ్చ చేస్తున్నారు. కర్మూలు జిల్లా ఎమ్మిగనూరు లో థియేటర్ల వద్ద ప్రభాస్ చిత్ర పటానికి 101 కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకం చేశారు అభిమానులు.
#Prabhas? #RadheShyam
??…..At Gajuwaka..?? pic.twitter.com/BX3nb3i7Iq— Sai Prabhas ?? (@Prabhas957356) March 11, 2022
Samalkota rebels celebrations ??#Prabhas #radheshyam #RadheshyamCelebrations pic.twitter.com/Z3sL2DEXQJ
— Salaar (@Agan_Veera) March 11, 2022