
బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు గత రెండేళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే హైదరాబాద్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది.
కేవలం హైదరాబాద్ నగరంలో అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 6.5 కోట్ల మార్కును క్రాస్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకు ఏ చిత్రానికి కూడా ఈ రేంజ్ లో బుకింగ్ కాలేదని చెపుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్ ఇలా ఉంటె..ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో వచ్చాయో అని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 7000కు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా 200 కోట్లు చేసినట్లు సమాచారం.