Homeటాప్ స్టోరీస్ఉగాది కానుకగా రాధే శ్యామ్ స్ట్రీమింగ్...?

ఉగాది కానుకగా రాధే శ్యామ్ స్ట్రీమింగ్…?

radhe shyam first review
radhe shyam first review

ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ మూవీ భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. ఇదిలా ఉంటె ఈ మూవీ ఓ పక్క థియేటర్స్ లలో సందడి చేస్తుండగానే , మరోపక్క ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైం భారీ ధరకు రాధేశ్యామ్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. ఇక ఏ సినిమా అయిన థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం 4 వారాల తర్వాతే డిజిటల్‌ ప్లాట్‌ఫాంకు వస్తుంది. అంటే రాధేశ్యామ్‌ ఏప్రిల్‌ 11 తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావాలి. కానీ ఏప్రిల్‌ 2న ఉగాది పండగ ఉండటంతో ఆ రోజే మధ్యాహ్నం 12 గంటల నుంచి రాధేశ్యామ్‌ స్ట్రీమింగ్‌ చేయాలని అమెజాన్‌ ప్లాన్‌ చేస్తుందని సమాచారం. మరి నిజంగా ఉగాది రోజున స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All