
మరికొద్ది గంటల్లో రాధే శ్యామ్ రిలీజ్ కాబోతుంది..థియేటర్స్ పట్టుకొని అభిమానులు సిద్ధంగా ఉన్నారు..మరికొంతమంది థియేటర్స్ ముస్తాబు చేయడం , భారీ కటౌట్స్ కట్టే పనుల్లో బిజీ ఉన్నారు..మరికొంతమంది సినిమా టాక్ ఎలా ఉంటుందో తెలుసుకునే ఆత్రుత లో ఉన్నారు. ఈ తరుణంలో సినిమాలోని మేజర్ హైలైట్స్ , సినిమాకు ప్రాణం పొసే సన్నివేశాలు బయటకు లీక్ అయ్యాయి.
ఈ మూవీ లవ్ అండ్ డెస్టినీ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. విధి ఆడే వింత నాటకం నుంచి హీరో తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నాడన్న కాన్సెప్టుతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఈ మూవీలో స్వతహాగా జోతిష్యుడు అయిన హీరోకు భవిష్యత్ గురించి తెలుస్తుంది. దీని ద్వారానే ఒక సందర్భంలో ట్రైన్ ప్రమాదం నుంచి.. మరో సందర్భంలో ఓడ ప్రమాదం నుంచి హీరోయిన్‌ను కాపాడుతాడట. ఈ రెండు ఎపిసోడ్లు సినిమాకే హైలైట్‌గా ఉంటాయట. ఇంటర్వెల్ ముందు వచ్చే మిస్టరీ ట్రైన్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుందట. అలాగే, క్లైమాక్స్‌లో వచ్చే ఓడ ప్రమాదం కూడా విజువల్ వండర్‌గా ఉంటుందని..ఆ రెండు సీన్లు వచ్చేటప్పుడు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటాయట..ఆ రెండు సీన్లు చూసేందుకు రెండు కళ్లు చాలవని అంటున్నారు. వీరు చెపుతుంటేనే ఇలా ఉంది..ఇక థియేటర్స్ లలో ఎలా ఉంటుందో మరి.