Homeగాసిప్స్రాధే శ్యామ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..సినిమా ఎలా ఉందంటే..

రాధే శ్యామ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..సినిమా ఎలా ఉందంటే..

radhe shyam first review
radhe shyam first review

దాదాపు మూడేళ్లుగా డార్లింగ్ అభిమానులు , సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్స్ , మేకింగ్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయడం తో సినిమాను ఎప్పుడెప్పుడా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసి సినిమా ఫై మరింత ఆసక్తి , అంచనాలు పెంచేసింది.

దుబాయ్ సెన్సార్ మెంబర్ గా చెప్పుకునే సినీ విశ్లేషకులు ఉమైర్ సంధు రాధే శ్యామ్ ఫస్ట్ రివ్యూ అంటూ తన సోషల్ మీడియా లో పేజీ లో రివ్యూ పెట్టేసాడు. సినిమా ఎవరు ఊహించని విధంగా ఉందని , క్లైమాక్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే అని , అసలు తెలుగు సినిమా చూస్తున్నామా…హాలీవుడ్ మూవీ చూస్తున్నామా అనే రేంజ్ లో గ్రాఫిక్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ క్లాస్ లుక్ లో కుమ్మేసాడని, ఈ సినిమా తో ప్రభాస్ రేంజ్ రెట్టింపు కావడం ఖాయమని తెలిపాడు. వీరి రివ్యూ తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఈయన రివ్యూ ను ఏమాత్రం నమ్మలేమని మరికొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. గతంలో ఈయన ఇచ్చిన రివ్యూ లు అలాగే ఉన్నాయని..ఈయన చెప్పింది ఒకటి అయితే సినిమా ఒకటి అయ్యిందని కామెంట్స్ వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి సోషల్ మీడియా లో రాధే శ్యామ్ ఫస్ట్ రివ్యూ చక్కర్లు కొడుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All