Homeటాప్ స్టోరీస్రేస్ 3 ట్రైలర్ వచ్చేసింది

రేస్ 3 ట్రైలర్ వచ్చేసింది

race 3 trailer outకండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించడమే కాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థ టిప్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” రేస్ 3” . రేస్ చిత్రాలు సంచలన విజయాలు సాధించడంతో అందులో భాగంగా మూడో చిత్రంగా వస్తోంది ఈ రేస్ 3 . మొదటి రెండు భాగాలకు అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం వహించగా ఈ మూడో చిత్రానికి ” రెమో డిసౌజా ” దర్శకత్వం వహించాడు . ఇక ఆ రెండు చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మూడో భాగాన్ని తెరకెక్కించాడట రెమో డిసౌజా .

ఈరోజు సాయంత్రం రేస్ 3 చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు . భారీ యాక్షన్ దృశ్యాలతో నిండిన రేస్ 3 ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది . సల్మాన్ ఖాన్ తో పాటు అనిల్ కపూర్ , జాక్వెలెన్ ఫెర్నాండేజ్ , బాబీ డియోల్ తదితరులు నటించారు . సల్మాన్ అత్యంత సాహసేపేతంగా చేసిన యాక్షన్ సీన్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 15న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందాల భామ జాక్వెలెన్ ఫెర్నాండేజ్ అందాలతో కుర్రకారు కి సవాల్ విసరడమే కాకుండా యాక్షన్ తో కూడా అలరించేలా కనబడుతోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All