Homeటాప్ స్టోరీస్సురేష్ బాబు -అల్లు అరవింద్ ల స్వార్థంవల్లే

సురేష్ బాబు -అల్లు అరవింద్ ల స్వార్థంవల్లే

r-narayanamurthy-fire-on-suresh-babu-and-allu-aravindతెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలుగా చలామణి అవుతున్నారు అల్లు అరవింద్ -దగ్గుబాటి సురేష్ బాబు లు . అయితే ఎప్పుడు కూడా వాళ్ళు చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసింది లేదు అలాగే కొత్తగా వస్తున్న నిర్మాతలను పీల్చి పిప్పి చేసి ఇక సినిమాలు వద్దురా దేవుడా ! అనిపించేలా చేస్తున్నారు . నైజాం లో ఎక్కువ శాతం థియేటర్ లు ఈ ఇద్దరి చేతుల్లోనే ఉన్నాయి దాంతో చిన్న నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాలంటే వీళ్ళతో పాటు దిల్ రాజు ని కూడా ఆశ్రయించాల్సి ఉంటుంది .

వీళ్ళ ద్వారా సినిమాలు విడుదల చేస్తే రకరకాల రూపంలో పెద్ద లిస్టే ఇస్తారు , డబ్బులు భారీగా వసూల్ చేస్తారు . ఒకవేళ సినిమా మంచి వసూళ్ల ని సాధించినప్పటికీ నిర్మాతకు మాత్రం పెద్దగా డబ్బులు తిరిగి రావు ఎందుకంటే దానికి తగ్గ బొక్కలు పెడతారు . తాజాగా డిజిటల్ పరంగా ఎక్కువ డబ్బులు వసూల్ చేస్తున్నారని థియేటర్ లను బంద్ చేసారు . కానీ వాళ్ళు పూర్తిగా దిగి రాకముందే వీళ్ళ స్వార్ధ ప్రయోజనాల కోసం బంద్ ని ఆపేసారు దాంతో విప్లవ నటుడు ఆర్ . నారాయణమూర్తి సురేష్ బాబు – అల్లు అరవింద్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . దాసరి , రామానాయుడు పది మంది నిర్మాతల బాగు కోరుకున్నారని కానీ సురేష్ బాబు – అల్లు అరవింద్ లు పూర్తిగా తమ స్వార్థం కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టాడు . అయితే ఎవరు ఎంతగా వాళ్ళని తిట్టినా డబ్బులు అడ్డంగా తినడానికి అలవాటు పడ్డ ఈ స్వార్ధ పరులు ఇసుమంత కూడా మారడం లేదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All