Homeటాప్ స్టోరీస్వర్మ డేంజ‌ర‌స్‌ కు ఆ రెండు థియేటర్స్ పెద్ద షాక్ ఇచ్చాయి

వర్మ డేంజ‌ర‌స్‌ కు ఆ రెండు థియేటర్స్ పెద్ద షాక్ ఇచ్చాయి

రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన నుండి సినిమా వస్తుందంటే దానిపై ఎంత హైప్ తీసుకురావాలో అంత తీసుకొస్తాడు. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే..రిలీజ్ సమయానికి అంత మాట్లాడుకునేలా చేస్తారు. దీనికోసం కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేయడు..జస్ట్ ట్విట్టర్ ఓపెన్ చేసి ట్వీట్స్ చేస్తాడు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. తాజాగా ఈయన డేంజరస్ అనే సినిమా రాబోతుంది. అప్సర రాణి, నైనా గంగూలీ లు ప్రధాన పాత్ర పోషించారు.

- Advertisement -

లెస్బియనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 8న వర్మ విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకు పెద్ద షాక్ ఇచ్చాయి పివిఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్. ఈ సినిమాను ప్రదర్శించలేమని ఈ రెండు థియేటర్స్ తేల్చి చెప్పినట్లు వర్మ తెలిపాడు. ఇద్దరు మహిళల మధ్య స్వలింగ సంపర్కం నేపథ్యంలో… ఆ సినిమాను ప్రదర్శించలేమని ఐనాక్స్, పివిఆర్ పేర్కొన్నట్లు ఆయన వివరించారు. సెన్సార్ బోర్డు ఓకే చెప్పినప్పటికీ ఇలా వారు వ్యవహరించడం అన్యాయమన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All