
పుష్ప మూవీ లో భన్వార్ సింగ్ షేఖావత్ గా అదరగొట్టిన ఫహద్ ఫాసిల్.. కరీంనగర్ లో దర్శనం ఇచ్చేసరికి జనాలంతా ఆయనదగ్గరికి వెళ్లి సెల్ఫీ లకు పోటీ పడ్డారు. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే కానీ ఆయన ఎవరో తెలిసి షాక్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఈయన పేరు శ్రీనివాస్. తోటి సహచరులు ముద్దుగా బుల్లెట్ శ్రీను అని పిలుస్తారు.
మొదటి నుండి కూడా శ్రీనివాస్ సినిమా హీరోల హెయిర్ స్టైల్ మెయింటేన్ చేసేవాడు. అయితే పుష్ప సినిమా రిలీజ్ తర్వాత ఆ సినిమాలో విలన్ ఎలా అయితే గుండుతో కనిపించాడో..ఆలా శ్రీనివాస్ గుండు చేయించుకున్నాడు. అంతే.. అచ్చం పుష్ప విలన్ మాదిరిగా ఉండడం తో అతనితో సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారు. ఇలా ప్రజలు తనతో సెల్ఫీలు దిగడం తనకి చాల ఆనందగా ఉంది అంటున్నాడు బుల్లెట్ శ్రీను.