
బన్నీ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్ననటిస్తోంది. లాక్‌డౌన్ టైమ్ కి ముందే కొంత భాగం చిత్రీకరణ జరిగిన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంత వరకు స్టార్ట్ అవ్వలేదు. గత ఏడు నెలలుగా పరిస్థితుల్లో మార్పులు రాకపోవడంతో ఈ మూవీ షూటింగ్ గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తోంది.
ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మారేడుమిల్లిలో జరగబోతోంది. మంగళవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మేకింగ్ గింప్స్‌ని చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఊర మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
`చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. ఫైనల్‌గా ఈ చిత్రాన్ని మంగళవారం ప్రారంభిస్తున్నాం. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాం` అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన ప్రీప్రొడక్షన్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక పక్కా గ్రామీణ యువతిగా కనిపించబోతోంది. మారేడు మిల్లిలో కీలక ఘట్టాలని రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో చిత్రీకరించబోతున్నారు. ఇందు కోసం రాజమండ్రిలో టీమ్ కోసం రిసార్ట్‌తో పాటు హోటల్స్‌ని కూడా సిద్ధం చేసిన విషయం తెలిసిందే.