Homeగాసిప్స్గాడ్ ఫాదర్ లో పూరి ఆలా కనిపించబోతున్నాడా..?

గాడ్ ఫాదర్ లో పూరి ఆలా కనిపించబోతున్నాడా..?

puri jagannath role in godfather
puri jagannath role in godfather

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్..మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ లో ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ తెరకెక్కుతుంది. ఇది మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’కు ఇది రీమేక్‌. ఈ సినిమా షూటింగ్ చ‌క చ‌కా జ‌ర‌గుతోంది. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొంద‌బోయే ఈ చిత్రాన్ని చిరంజీవి ఇమేజ్‌కు, తెలుగు నెటివిటీకి త‌గిన‌ట్లు మార్చి తెర‌కెక్కిస్తున్నారు. ఈ తరుణంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి కూడా ఓ కీలక రోల్ లో కనిపించబోతున్నట్లు స్వయంగా చిరంజీవే తెలిపారు. దీంతో పూరి ఏ రోల్ లో కనిపిస్తాడో అని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో పూరి రోల్ ఫై ఓ వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. సినిమా ఆరంభంలో పాత్రలను పరిచయం చేసే జర్నలిస్టు పాత్రలో ఈ స్టార్ డైరెక్టర్ కనిపించబోతున్నట్టు సమాచారం. గాడ్ ఫాదర్‌ సినిమాను డ్రైవ్ చేసే పాత్రను పూరీ పోషిస్తున్నట్టు సమాచారం. ఈ పాత్ర ఈ సినిమాకు కీలకంగా మారబోతున్నట్టు అంటున్నారు. మరి నిజంగా ఇదే రోల్ చేస్తున్నాడా అనేది చూడాలి. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All