
సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్తగా `పూరి మ్యూజింగ్స్` పేరుతో చయాపిల్ పోడ్ కాస్ట్‌తో పాటు యూట్యూబ్‌లో ఆడియో వీడియోలని రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఫ్లాప్ మూవీస్ పై తైదైన స్టైల్లో థియేరీని చెప్పుకొచ్చారు. `ఫ్లాప్ మూవీస్.. ఫ్లాప్‌ని ఎవ్వరూ కోరుకోరు. ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ఎవరూ తీయరు. ఏడాదిలో రెండు వందల సినిమాలొస్లే .. హిట్‌లు.. బ్లాక్ బస్టర్‌లు కలిపి పదే వుంటాయి. మిగిలిన నూట తొంబై ఫ్లాపులే. జీవితాంతం ఈ ఫ్లాపులు చూడలేక వాటిని ఎనలైజ్ చేయలేక జర్నలిస్టులకు తిక్కలేసి రివ్యూలతో వాయించి పడేస్తారు. ఎందుకంటే అన్ని సినిమాలు అలాగే ఏడుస్తున్నాయ్. ఆ రివ్యూల దెబ్బకి అప్పటికే అన్నీ లమ్ముకున్న ప్రొడ్యూసర్ ఇండస్ట్రీని వదిలేసి పోతాడు.
అతడి ప్లేస్‌లో ఇంకొకడు వస్తాడు. ఇంకో ఫ్లాప్ సినిమా తీస్తాడు. నిజం ఏమిటంటే ఆ నూటా తొంబై ఫ్లాపులమీదే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇక్కడ అన్నం పెట్టేవి అవే. ఫ్లాప్ సినిమా వల్ల కూడా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక ఫ్లాప్ సినిమా కోసం ప్రొడ్యూసర్ కోట్లు ఖర్చు పెడితే.. యాక్టర్లు.. జూనియర్ ఆర్టిస్ట్‌లు.. సెట్‌లు.. అవుట్ డోర్ యూనిట్, లొకేషన్‌ల కోసం ఇలా ఎంతో మందికి పనిస్తాడు.. అందరూ రెమ్యునరేషన్‌లు తీసుకుంటారు. గవర్నమెంట్‌కు ట్యాక్స్‌లు కడతారు. అందరికి కవర్లు ఇస్తాడు. హోర్డింగ్‌లకి, పేపర్ యాడ్స్‌కి, వెబ్ సైట్స్‌కి, హోటల్స్‌కి, ట్రైన్లకి, ఫ్లైట్స్‌కి ఇలా అందరికి డబ్బు కట్టే వుంటాడు. అందరం బెనిఫిట్స్ పొందుతాం. కానీ సినిమా తేడా వస్తే వాడి తాట తీస్తాం.
మన రాతలతో మరో సినిమా రాకుండా చేస్తాం. ఫ్లాప్ డైరెక్టర్‌కు మరో ఆఫర్ రాకుండా చేస్తాం. మూవీ రివ్యూస్ రాసే అందరికి చేతులెత్తి మొక్కుతున్నా. మీరు కాపాడాల్సింది ఫ్లాప్ సినిమాల్ని బ్లాక్ బస్టర్స్‌ని కాదు. వాటికి మీ అవసరం లేదు. ఐ నో ఆల్ యువర్ ఫ్రస్ట్రేటెడ్ బ్యాడ్ మూవీస్. బట్ ఇక్కడ ఎవరూ జీనియస్ కాదు. తెలిసో తెలియకో డైరెక్టర్ ఫ్లాప్ తీసివుండొచ్చు. కానీ వాడివల్ల కొంత మందికి తిండి దొరుకుతుంది. వాడు బుర్ర తక్కువ వాడు కావచ్చు. వాడిని ప్రొడ్యూసర్‌ని కాపాడాల్సిన బాధ్యత మనది. రేటింగ్ కావాలంటే ఒకటి ఇవ్వాలనుకుంటే రెండు ఇవ్వండి. రెండు ఇవ్వాలనుకుంటే మూడు ఇవ్వండి రేటింగ్ పెరిగితే శాటిలైట్ అవుతుంది. దాంతో చాలా కుటుంబాలు బ్రతుకుతాయి` అన్నారు పూరి.