Homeటాప్ స్టోరీస్గాడ్ ఫాదర్ లో జాయిన్ అయినా పూరి జగన్నాధ్

గాడ్ ఫాదర్ లో జాయిన్ అయినా పూరి జగన్నాధ్

puri jagannadh joins god father
puri jagannadh joins god father

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్..చిరంజీవి సినిమాలో ఓ కీలక రోల్ లో నటిస్తున్నాడని ఆ మధ్య విజయ్ దేవరకొండ చెప్పడం తో మెగా అభిమానులతో పాటు , పూరి ఫ్యాన్స్ ఏ సినిమాలో నటిస్తున్నాడా అని ఆసక్తి గా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఆ మాటలకు తెరదించారు చిరు. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ లో మూవీ సెట్ లో పూరి జాయిన్ అయ్యాడు. ఈ సందర్భాంగా చిరంజీవి..పూరి కి పుష్పగుచ్ఛము అందజేసి గ్రాండ్ వెల్ కామ్ చెప్పారు. ఈ మూవీ లో ఓ స్పెషల్ రోల్ లో పూరి కనిపిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.

చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’కు ఇది రీమేక్‌. ఈ సినిమా షూటింగ్ చ‌క చ‌కా జ‌ర‌గుతోంది. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొంద‌బోయే ఈ చిత్రాన్ని చిరంజీవి ఇమేజ్‌కు, తెలుగు నెటివిటీకి త‌గిన‌ట్లు మార్చి తెర‌కెక్కిస్తున్నారు. ఈ తరుణంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన తాలూకా సన్నివేశాలను ముంబై లో పూర్తీ చేసారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -

ఇక పూరి విషయానికి వస్తే..ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో లైగర్ మూవీ పూర్తి చేసాడు. ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తన నెక్స్ట్ సినిమా కూడా విజయ్ తోనే చేస్తున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన ను విజయ్ తో చేస్తున్నాడు. రీసెంట్ ఈ మూవీ ప్రారంభం అయ్యింది. ఈ చిత్రం తాలూకా విశేషాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All