Homeఎక్స్ క్లూసివ్ఈ సినిమాతోనైనా హిట్ కొడతారా ?

ఈ సినిమాతోనైనా హిట్ కొడతారా ?

Puri jagannadh confirmed his next film with Ram
Puri Jagannadh and Ram

హీరో రామ్ పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో అధికారికంగా సినిమా ప్రకటించారు . ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు కానీ అధికారికంగా మాత్రం ఈరోజే ప్రకటించారు . పూరి జగన్నాధ్ కు గతకొంత కాలంగా హిట్స్ లేవు దాంతో ఈ దర్శకుడ్ని ఏ హీరో పట్టించుకోవడం లేదు దాంతో కొడుకు ఆకాష్ పూరి ని హీరోగా పెట్టి ” మెహబూబా ” అనే సినిమా చేసాడు అది కూడా ప్లాప్ అయ్యింది . ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ప్లాప్ కావడంతో ఖంగుతిన్న పూరి వెంటనే రామ్ డేట్స్ పట్టడం కథ చెప్పి ఒప్పించడం గ్రేటే !

పూరి చెప్పిన కథ రామ్ కు నచ్చడంతో విభిన్నమైన గెటప్ ని ట్రై చేస్తున్నాడు రామ్ . ఇక రామ్ కు కూడా చాలారోజులుగా సక్సెస్ లేదు . సాలిడ్ హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అవుతోంది దాంతో పూరి పై ఆశలు పెట్టుకున్నాడు . యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంతో హీరో రామ్ దర్శకులు పూరి జగన్నాధ్ కు హిట్ కొడితే సంతోషమే ! లేదంటే దర్శకుడిగా పూరి జగన్నాధ్ కెరీర్ ముగిసినట్లే !

- Advertisement -

English Title: Puri jagannadh confirmed his next film with Ram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All