Homeటాప్ స్టోరీస్ఇండిపెండెంట్ డాట‌ర్స్ కి సెల్యూట్ : పూరి‌

ఇండిపెండెంట్ డాట‌ర్స్ కి సెల్యూట్ : పూరి‌

ఇండిపెండెంట్ డాట‌ర్స్ కి సెల్యూట్ : పూరి‌
ఇండిపెండెంట్ డాట‌ర్స్ కి సెల్యూట్ : పూరి‌

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇటీవ‌ల పూరి మ్యూజింగ్స్ పేరుతో యాపిల్ పోడ్ కాస్ట్‌తో పాటు యూట్యూబ్‌లో ఆడియో ఫైల్స్‌ని రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.  సోమ‌వారం పూరి 53వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్నారు. ఆదివారం హ్యాపీ డాట‌ర్స్‌డే సంద‌ర్భంగా ఆయ‌న డాట‌ర్స్ గురించి ఓ ప్ర‌త్యేక‌త ఆడియోని షేర్ చేసుకున్నారు. ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల త‌ల్లిదండ్రులు ఎలా వుండాల‌నే దానిపై ఉన్న‌త‌మైన భావాల్సి వెల్ల‌డించారు. అమ్మాయిల్ని స్వ‌తంత్రంగా ఎద‌గ‌నివ్వాల‌ని, వారి భావాల‌కు ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని చెప్పుకొచ్చారు. ఆ విష‌యాలు ఆయ‌న మాటల్లోనే.. ఇండియాలో చాలా మంది వారి క‌డుపున అబ్బాయే పుట్టాల‌ని కోరుకుంటారు. అమ్మాయి మాత్రం వ‌ద్దు. అమ్మాయి పుట్ట‌గానే అప్సెట్ అయిపోయిన చాలా మంది మ‌గాళ్ల‌ని చూశాను. ఇండియాలో స‌ర్వే చేస్తే తెలిసింది. ఫ‌ఫ్టీ ప‌ర్సెంట్ ఆడ‌వాళ్లు కూడా అబ్బాయే కావాల‌ని కోరుకుంటున్నారు. ఎందుకంటే మెయిన్ రీజ‌న్ ఓల్డ్ ఏజ్‌లో కొడుకైతే అమ్మాన్న‌ని చూసుకుంటాడు, కూతురైతే పెళ్లి చేసుకుని వెళ్లిపోద్ది అని. అది వాళ్ల భ్ర‌మ‌.

కొడుకు చూస్తాడ‌న్న గ్యారెంటీ లేదు. పేరెంట్స్‌ని రోడ్డుమీద వ‌దిలేసిన ఎంతో మంది కొడుకులున్నారు. కానీ అత్తింట్లో వున్నా అమ్మానాన్న‌ల్ని చూసుకునే ఎంతో మంది కూతుళ్లున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు మోర్ ఎమోష‌న‌ల్ మోర్ రెస్పాన్సిబుల్‌. కూతుర్ని బాగా చ‌దివిస్తాం. కానీ పెళ్లి చేసి ఎవ‌డో కిచ‌న్‌లో మ‌న‌మే ప‌డేస్తాం. వాళ్లు ఎద‌గ‌డానికి ఎప్పుడూ హెల్ప్ చేయం. దీని పెళ్లైపోతే చాలు అనే మూడ్‌లో వుంటాం. బ‌ట్ కూతుళ్ల మ‌న‌సెప్పుడూ త‌ల్లిదండ్రుల‌మీదే వుంట‌ది. అమ్మానాన్న‌ల గురించే ఆలోచిస్తుంటారు. మొహంమ్మీదే అమ్మా నాన్న గురించి తిట్టినా మ‌గాళ్లు ఏమీ అన‌రు. అదే ఆడ‌పిల్ల‌ల‌ని వాళ్ల అమ్మా నాన్న గురించి ఒక్క మాట అనండి మీ అంతు చూస్తారు. పేరెంట్స్ కోసం నిజంగా నిల‌బ‌డేది కూతుళ్లే. నిజంగా సేవ చేసేది కూడా వాళ్లే. పెళ్లి చేసి చేతులు దులిపేసుకోవ‌డం కాదు. కూతురు కెరీర్ గురించి ఆలోచించ‌డం నేర్చుకోవాలి. మ‌న ఓల్డేజ్ ప్లాన్ కోసం కాదు. కొడుకుల్లాగే వాళ్లూ ఎద‌గాలి. వాళ్ల కాళ్ల‌మీది వాళ్లు నిల‌బ‌డేలాగ చూడాలి. వాళ్ల‌కి వాళ్ల ఒపీనియ‌న్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. పెళ్లొద్దు అంటే మానెయ్యాలి. బిజినెస్ చేస్తాను అంటే చేయ‌మ‌నాలి. కొండెక్కుతాను నాన్నా అంటే ఎక్క‌మ‌నాలి. ద‌య‌చేసి కూతుళ్ల‌ని తీసుకెళ్లి కిచెన్‌లో ప‌డేయ‌కండి.

- Advertisement -

ఆడ‌వాళ్ల‌కి సెక్యూరిటీ సెఫ్టీ వున్న దేశాలు ఏంటా అని గూగుల్ చేశా. టాప్ 20 కంట్రీస్‌లో మ‌న దేశం క‌నిపించ‌లేదు. టాప్ 100 లో కూడా వెతికా క‌నిపించ‌లేదు. ఇక వ‌ర‌స్ట్ కంట్రీస్ ఆఫ్ ఉమెన్ అని కొట్టా అందులో వుంది మ‌న దేశం పేరు. ఇత‌ర దేశాల్లో ఆడ‌దాన్ని ఏమైనా అంటే తాట‌తీస్తారు. కాబ‌ట్టి మ‌నం కూడా మార‌దాం. మ ఆడ‌పిల్ల మీ ఇంటి ల‌క్ష్మీదేవి అని మీరు ఫీలైతే తీసుకెళ్లి ఎవ‌డో కొంప‌ల్లో ప‌డేయ‌కండి. మై సెల్యూట్ టు ఆల్ మైండెడ్ పేరెంట్స్ అండ్ డాట‌ర్స్‌`అని పూరి డాట‌ర్స్ గురించి అద్భుత‌మైన లెక్చ‌ర్ ఇచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All