
ప్రభాస్ – నాగ్ అశ్విన్ కలయికలో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీపిక పదుకునే హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా లో బాలీవుడ్ మెగాస్టార్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం కొన్ని నెలల క్రితం కాస్టింగ్ కాల్ ఇచ్చారు.
ఇక ఇప్పుడు స్టంట్స్ క్రూ కాల్ కావాలంటూ మరో అప్డేట్ ఇచ్చారు. సినిమాలోని ఒక భారీ యాక్షన్ సన్నివేశం కోసం వందల కొద్ది ఫైటర్స్ అవసరం అవ్వడం వల్లే ఇలా కాస్టింగ్ కాల్ ఇచ్చారు అనే సమాచారం ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ తో పాటు పలు చోట్ల సినిమా షూటింగ్ జరుపుకుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
- Advertisement -