
తెలుగుచిత్ర సీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఏసియన్ మల్టీప్లెక్స్, ఏసియన్ థియేటర్స్‌కు అధినేత, నారంగ్(78) మృతిచెందారు. కొద్దీ రోజులుగా తీవ్ర అస్వస్థతో బాధ పడుతూ.. స్టార్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. కాగా ఈరోజు పరిస్థితి విషమించడంతో ఆయన స్వర్గస్తులయ్యారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌లో రీసెంట్ గా ‘లవ్ స్టోరీ’, ‘లక్ష్య’ సినిమాలు నిర్మించారు.
ప్రస్తుతం ఈయన నాగార్జునతో ‘ఘోస్ట్’, ధనుష్‌తో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరి కాసేపట్లో హాస్పిటల్ నుంచి నారాయణ్ దాస్ నారంగ్ భౌతికకాయం ఫిల్మ్ నగర్ లోని నివాసానికి తరలిస్తారు. అక్కడకు సినీ ప్రముఖులు చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు.
- Advertisement -