Homeటాప్ స్టోరీస్అక్టోబర్ 5న ప్రేమెంత పనిచేసే నారాయణ

అక్టోబర్ 5న ప్రేమెంత పనిచేసే నారాయణ

Prementha panichese narayana gets release dateవారసుల రాజ్యం అయిన టాలీవుడ్ లోకి మరో వారసుడు వచ్చి పడుతున్నాడు . దర్శకత్వ శాఖలో పలు చిత్రాలకు పనిచేసిన జొన్నలగడ్డ శ్రీనివాసరావు తన తనయుడు జొన్నలగడ్డ హరికృష్ణ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ” ప్రేమెంత పనిచేసే నారాయణ ” . అక్షిత హీరోయిన్ గా నటించిన ఈ ప్రేమకథా చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . తనయుడిని హీరోగా నిలబెట్టడానికి స్వయంగా నిర్మాణరంగంలోకి దిగాడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు , సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుందని, 30 ఏళ్లుగా ఫిలిం ఇండస్ట్రీతో సుదీర్ఘ అనుబంధం ఉందని అందరి ఆశీస్సులతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు .

ఇక హీరోగా పరిచయం అవుతున్న హరికృష్ణ లో మంచి ఈజ్ ఉందని అలాగే డ్యాన్స్ ఇరగ్గొట్టాడని పలువురు సినీ ప్రముఖులు హరికృష్ణ పై ప్రశంసల వర్షం కురిపించారు . కథలో ట్విస్ట్ లున్నాయని , యువతని బాగా ఆకట్టుకునే విధంగా రూపొందిందని తప్పకుండా విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు హరికృష్ణ .

- Advertisement -

English Title: Prementha panichese narayana gets release date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All