Homeటాప్ స్టోరీస్పోలీస్ స్టేషన్ కు ఎక్కిన హీరోయిన్

పోలీస్ స్టేషన్ కు ఎక్కిన హీరోయిన్

Preeti jhangiani lodges police complaintఓ గొడవలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది హీరోయిన్ ప్రీతి జింగానీయ . నందమూరి బాలకృష్ణ తో నరసింహనాయుడు చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన తమ్ముడు సినిమాలో నటించిన భామ ప్రీతి జింగానీయ అయితే ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో స్టార్ డం ని అందుకోలేకపోయింది దాంతో పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది . కట్ చేస్తే సంసారం చేసుకుంటున్న ప్రీతి బిడ్డకు తల్లి కూడా అయ్యింది . ఏడేళ్ల కొడుకు ఉన్నాడు ఈ భామకు .

అయితే తాను నివసించే అపార్ట్ మెంట్ లో పిల్లలంతా కలిసి ఆడుకుంటున్న సమయంలో ఓ పెద్ద వ్యక్తి వచ్చి ప్రీతి జింగానీయ కొడుకుని కొట్టడంతో పోలీసులను ఆశ్రయించింది . అయితే చిన్న గొడవ కావడంతో పోలీసులు ప్రీతి జింగానీయ కు సర్దిచెప్పి పంపించారు . పెళ్లి చేసుకున్నాక మీడియా ముందుకు రాని ప్రీతి జింగానీయ పదేళ్ల తర్వాత ఇలా ఏడేళ్ల కొడుకుతో ముందుకు రావడం ,అది కూడా గొడవ మూలంగా రావడం విచిత్రమే !

- Advertisement -

English Title: Preeti jhangiani lodges police complaint

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All