Homeటాప్ స్టోరీస్రూలర్, ప్రతిరోజూ పండగే చిత్రాలకు ఇబ్బంది తప్పదా?

రూలర్, ప్రతిరోజూ పండగే చిత్రాలకు ఇబ్బంది తప్పదా?

రూలర్, ప్రతిరోజూ పండగే చిత్రాలకు ఇబ్బంది తప్పదా?
రూలర్, ప్రతిరోజూ పండగే చిత్రాలకు ఇబ్బంది తప్పదా?

ముందు నుండి అనుకున్నట్లుగానే నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ కు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే చిత్రాలకు మిగతా భాషల నుండి పోటీ కారణంగా ఇబ్బందులు తప్పేలా లేవు. తెలుగులో ఈ రెండు చిత్రాలు ఎప్పటినుండో రిలీజ్ డేట్ లు ప్రకటించుకుని దాని ప్రకారం షెడ్యూల్స్ వేసుకుని ప్రమోషన్స్ కూడా పూర్తి చేసుకున్నాయి. అయితే ఇప్పుడు అనుకోకుండా మిగతా భాషల నుండి సినిమాలు అదే రోజున విడుదలవుతూ ఈ రెండు తెలుగు చిత్రాలనూ ఇబ్బందికి గురి చేస్తున్నాయి.

మొదటినుండి ప్రతిరోజూ పండగే, రూలర్ చిత్రాలకు డీసెంట్ క్రేజ్ ఉంది. ఈ రెండు చిత్రాల టార్గెట్ ఆడియన్స్ కూడా వేరు కావడంతో ఒకరి సినిమా విడుదలతో మరొక సినిమాకు ఇబ్బంది లేకుండా పోయింది. అయితే ఇప్పుడు తమిళం నుండి కార్తీ నటించిన దొంగ సినిమా అదే రోజున వస్తోంది. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తీ ఇప్పుడు మంచి ఊపు మీదున్నాడు. పైగా అన్న భార్య జ్యోతికతో కలిసి ఈ సినిమా చేస్తున్నాడు. ఇద్దరూ ఈ చిత్రంలో అక్కాతమ్ముడిగా నటించిన విషయం తెల్సిందే.

- Advertisement -

ఇక ఇంగ్లీష్ నుండి స్టార్ వార్స్, హిందీ నుండి దబాంగ్ 3 కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నిన్న రాత్రే దబాంగ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఘనంగా ఈ వేడుకను నిర్వహించారు. రామ్ చరణ్, వెంకటేష్ కూడా హాజరయ్యారు. ఈ రెండు సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ లో, రెండు తెలుగు రాష్ట్రాలలోని మల్టీ ప్లెక్స్ లలో ప్రభావం గట్టిగా చూపిస్తాయి. ఈ రెండు చిత్రాల వల్ల ప్రతిరోజూ పండగే ఓవర్సీస్ మార్కెట్, మల్టీప్లెక్స్ మార్కెట్ బాగా హర్ట్ అవుతుంది అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. బాలయ్య రూలర్ పక్కా మాస్ సినిమా. సింగిల్ స్క్రీన్స్ ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ తెరకెక్కిన చిత్రం. దీంతో ఓవర్సీస్, మల్టీప్లెక్స్ మార్కెట్ ఈ చిత్రాన్ని పెద్ద దెబ్బ తీసే అవకాశాలు లేవు. ప్రధానమైన చిక్కంతా ప్రతిరోజూ పండగేకే వచ్చే ప్రమాదముంది.

ఇక సింగిల్ స్క్రీన్స్ లో కార్తీ నటించిన దొంగ ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వేరే భాషల నుండి విడుదలవుతున్న ఈ మూడు చిత్రాలతో ప్రతిరోజూ పండగే, రూలర్ సినిమాలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All