Homeటాప్ స్టోరీస్ప్రత్యర్థి మూవీ రివ్యూ

ప్రత్యర్థి మూవీ రివ్యూ

ప్రత్యర్థి మూవీ రివ్యూ
ప్రత్యర్థి మూవీ రివ్యూ

టైటిల్‌: ప్రత్యర్థి
నటీనటులు: రవి వర్మ, రొహిత్ బెహల్, అక్షత సోనవానె తదితరులు
నిర్మాణ సంస్థ : గాలు పాలు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : సంజయ్ సాహ
దర్శకత్వం : శంకర్ ముడావత్
సంగీతం: పాల్‌ ప్రవీణ్‌
సినిమాటోగ్రఫీ: రాకేష్‌ గౌడ్‌
విడుదల తేది: జనవరి 6, 2022
రేటింగ్: 2.75/5

‘ప్రత్యర్థి’ కథేంటంటే..
కృష్ణ ప్రసాద్‌(రవివర్మ) హైదరాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో ఎస్సైగా పని చేస్తుంటాడు. భార్య జయ(సన), కూతురు నిత్య అతనికి దూరంగా ఉంటారు. ఓ సారి తన భర్త విజయ్‌ కనిపించడం లేదని వైశాలి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కేసు నమోదు చేసుకున్న కృష్ణ ప్రసాద్‌.. తనదైన స్టైల్లో విచారణ చేపడతాడు. ఈ క్రమంలో విజయ్‌, వైశాలికి మధ్య గొడవలు జరుగుతున్నాయని, అతనికి రేచల్‌ అనే ప్రియురాలు ఉందని తెలుస్తుంది.

- Advertisement -

ఈ కోణంలో విచారణ చేపడుతుండగా.. సయ్యద్‌ అనే ఓ యువకుడు పోలీసు స్టేషన్‌కు వచ్చి.. విజయ్‌ మిస్‌ అయిన రోజు రాత్రి ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకొని అతని ఇంట్లోకి వెళ్లడం తాను చూశానని చెబుతాడు. దీంతో విజయ్‌ని చంపింది వీరేనంటూ.. మెకానిక్‌ ఉద్యోగం చేస్తున్న శివ( రోహిత్‌ బెహల్‌), శశి, అశోక్‌(బల్‌వీర్‌ సింగ్‌)లను అరెస్ట్‌ చేస్తారు. కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగా షాకింగ్‌ విషయాలు తెలుస్తాయి. అవేంటి? అసలు విజయ్‌ని ఎవరు హత్య చేశారు? ఈ ముగ్గురికి ఆ హత్యతో నిజంగానే సంబంధం ఉందా? ఆ రోజు రాత్రి ముసుగు వేసుకొని వెళ్లి ఆ ముగ్గురు ఎవరు? ఎందుకు వెళ్లారు? కృష్ణ ప్రసాద్‌ కూతురు నిత్యను గన్‌తో కాల్చి చంపిందెవరు? నిత్యతో శివకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు నేరస్తుడు ఎవరని తేలింది? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ల సినిమాలకు ఎప్పుడూ జనాల్లో ఆదరణ ఉంటుంది. సరైన కథ, కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ ప్లేతో సినిమాలు తీస్తే జనాలు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారు. అందుకే ఆ తరహా చిత్రాలను తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు మన దర్శకత నిర్మాతలు. ‘ప్రత్యర్థి’ కూడా ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమే. ఊహించని ట్విస్ట్‌లతో కథనం సాగుతుంది. విజయ్‌ అనే వ్యక్తి మిస్‌ అవ్వడం.. అతని భార్య పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కథ ప్రారంభం అవుతుంది. కేసు విచారణలో భాగంగా ఎస్సై పలు రకాలుగా ఊహించడం.. ఆ పాత్రలో కాసెస్టేబుల్‌ని చూపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే మధ్య మధ్యలో వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌ బాగున్నప్పటికీ.. కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. అలాగే పలు రకాల పాత్రలు వచ్చి పోవడం గందరగోళంగా అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. చెత్త కుప్పలో విజయ్‌ శవం దొరికిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. ఫస్టాఫ్‌లో అనవరం అనుకున్న ప్రతి సీన్‌కి సెకండాఫ్‌లో క్లారిఫికేషన్‌ ఇచ్చాడు దర్శకుడు. క్లైమాక్స్‌లో రివీల్‌ చేసే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. స్క్రీన్‌ప్లేని మరింత పకడ్బందీగా చేసుకొని, పేరున్న నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.

ఎవరెలా చేశారంటే..
ఎస్సై కృష్ణ ప్రసాద్‌ పాత్రలో రవివర్మ ఒదిగిపోయాడు. పలు చిత్రాలో చిన్నపాటి పాత్రలు పోషించిన రవి వర్మ.. ఈ చిత్రంలో ఫుల​ లెన్త్‌ రోల్‌ చేశాడు. శివ పాత్రకి రోహిత్ బెహల్ న్యాయం చేశాడు. తెరపై బాలీవుడ్‌ హీరోలా కనిపించాడు. కానిస్టేబుల్‌ సత్యగా వంశీ ఆలూర్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రైవేట్‌ డిటెక్టివ్‌ నిత్యగా అక్షత సోనవానె తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరో స్నేహితుడిగా బల్‌వీర్‌ సింగ్‌ పాత్ర తీరు, కామెడీ ఆకట్టుకుంటుంది. లాయర్‌ రఘునాథ్‌ పాత్రలో దివంగత టీఎన్నార్‌ తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా.. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తాగుబోతు రమేశ్‌, వంశీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

ఇక సాంకేతి విషయానికొస్తే.. దర్శకుడు శంకర్‌కి ఇది తొలి సినిమా .అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాను తెరకెక్కించాడు. ట్విస్టులను క్లైమాక్స్‌ వరకు రివీల్‌ చేయకుండా ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచడంలో సఫలం అయ్యాడు. పాల్‌ ప్రవీణ్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. రాకేష్‌ గౌడ్‌ కెమెరాపనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

రేటింగ్: 2.75/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All