Homeటాప్ స్టోరీస్తల్లి కాబోతున్న ప్రణీత..ఈ రేంజ్ లో డాన్స్ లు చేస్తే ఎలా..?

తల్లి కాబోతున్న ప్రణీత..ఈ రేంజ్ లో డాన్స్ లు చేస్తే ఎలా..?

pranitha baby bump dance
pranitha baby bump dance

ఈ మధ్య హీరోయిన్స్ అంత కూడా ప్రెగ్నెంట్ అనే విషయాన్నీ ఏమాత్రం దాచుకోకుండా ఫ్యాన్స్ కు తెలియజేస్తూ..ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అంతే కాదు బేబీ బంప్ తో సరికొత్త ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత కూడా త్వరలో తల్లి కాబోతుంది. రీసెంట్ గా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. తొలి సారి తల్లి కాబోతున్నానని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్న తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది.

గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లాడిన ఆమె ఈ నెల 11న తాను గర్భవతినన్న విషయాన్ని వెల్లడించింది. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకున్న ఆమె ఈ శుభవార్తను ముందుగా భర్త నితిన్‌కి చెప్పింది. ఆ తర్వాత తన పేరెంట్స్‌కు, అత్తమామలకు, అనంతరం ఫ్యాన్స్‌కు తెలియజేసింది. ఇక ప్రెగ్నెన్సీ టైంలో యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేసేందుకు ప్లాన్‌ చేస్తానంది. కానీ తాజాగా ‘థ్రోబ్యాక్‌’ అంటూ ఓ పాటకు స్టెప్పులేస్తున్న వీడియోను షేర్‌ చేసింది. ఈ వీడియో చూసి అంత షాక్ అవుతున్నారు. కడుపుతో ఉన్న టైం లో ఈ రేంజ్ డాన్సులా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ప్రణీత గర్భం దాల్చిన తర్వాత ఈ డ్యాన్స్‌ చేసిందా..? లేదా ఇది అంతకుముందు వీడియోనా..? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ప్రణీత జోష్‌ చూస్తుంటే డ్యాన్స్‌తో అటు బాడీని ఫిట్‌గా ఉంచుకుంటూనే మనసును సైతం ఉల్లాసంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All