Homeటాప్ స్టోరీస్పవన్ ను ఢీకొట్టే పాత్రలో విలక్షణ నటుడు

పవన్ ను ఢీకొట్టే పాత్రలో విలక్షణ నటుడు

పవన్ ను ఢీకొట్టే పాత్రలో విలక్షణ నటుడు
పవన్ ను ఢీకొట్టే పాత్రలో విలక్షణ నటుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీను పింక్ రీమేక్ ద్వారా ఇస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత వేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న సినిమాగా ఇది నిలుస్తుంది. మొదలైన నాలుగు నెలల్లోనే ఈ సినిమా విడుదల చేస్తారు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం కేవలం 28 రోజుల కాల్ షీట్స్ ఇవ్వడం విశేషం. ఈ చిత్రానికి నిర్మాత అయిన దిల్ రాజు, టైటిల్ అనౌన్స్మెంట్ ఉగాదికి ఉంటుందని, సినిమాను మే 15న విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే.

ఇక ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. సినిమాకు కీలకమైన కోర్ట్ రూమ్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్న విషయం తెల్సిందే. ముగ్గురు ఆడపిల్లలపై తీవ్రమైన అభియోగం నమోదైన నేపథ్యంలో వారిని కాపాడి సమాజానికి సరైన మెసేజ్ ఇచ్చే పాత్రలో పవన్ కనిపిస్తాడు. అయితే ఈ చిత్రంలో ఫైట్లు వంటివి ఏముండవన్న విషయం పింక్ రీమేక్ చూసిన వాళ్లకు అర్ధమవుతుంది. కేవలం వాదనలు, ప్రతివాదనలతోనే హీరోయిజం ఎలివేట్ అవుతుంది.

- Advertisement -

పవన్ కళ్యాణ్ హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే తనను ఢీకొట్టే పాత్ర ఉండాలి కదా. అలాంటి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడు. ఈ చిత్రంలో క్రిమినల్ లాయర్ గా, నేరం చేసిన వాళ్ళను రక్షించడానికి ప్రయత్నించే లాయర్ గా నటిస్తున్నాడు. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకం. అటు ముగ్గురు అమ్మాయిలను, ఇటు హీరోను తన మేధస్సుతో ఇరుకునపెడుతుంది ఈ పాత్ర. మరి అలాంటి పాత్రకు ప్రకాష్ రాజ్ అయితేనే సరిపోతాడని ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. పవన్ – ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయని అంటున్నారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All