Homeటాప్ స్టోరీస్రాహుల్‌ని కొట్టి చంపేస్తారా? : ప‌్ర‌కాష్‌రాజ్‌

రాహుల్‌ని కొట్టి చంపేస్తారా? : ప‌్ర‌కాష్‌రాజ్‌

Prakash raj reacts on Rahul sipligunj issue
Prakash raj reacts on Rahul sipligunj issue

సింగ‌ర్‌, బిగ్‌బాస్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌పై ఇటీవ‌ల గ‌చ్చిబౌలిలోని పంబ్‌లో అధికార పార్టీకి చెందిన వికారాబాద్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోద‌రుడు రిషిత్‌రెడ్డి, అత‌ని ఫ్రెండ్స్ బీర్ బాటిల్స్‌తో దాడి చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ప‌బ్‌లో రాహుల్ త‌న స్నేహితుల‌తో క‌లిసి పాట పాడుతుండ‌గా మ‌ధ్య‌లో వ‌చ్చిన రోహిత్‌రెడ్డి త‌మ్ముడు రిషిత్ రాహుల్‌ని నెట్టేయడంతో గొడ‌వ మొద‌లైంది. దీంతో అత‌ని స్నేహితులు రాహుల్‌పై బీర్ బాటిల్స్‌తో దాడికి దిగారు. ముఖంపై గాయాలు కావ‌డంతో లైవ్‌లోకి వ‌చ్చిన రాహుల్ మంత్రి కేటీఆర్‌ని త‌న‌కు న్యాయం చేయ‌మ‌ని అభ్య‌ర్తించారు.

తాజాగా ఈ విష‌యంపై విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ స్పందించారు. రాహుల్ పై దాడిచేయ‌డం త‌ప్పు. అత‌ని వెంట ఎవ‌రూ లేర‌నుకోవ‌ద్దు అంటూ హెచ్చించారు. అత‌డి వెంట నేనున్నాను. అభిమానులున్నారు. అలా కొట్ట‌డం ఏంటి? చ‌ంపేస్తారా?. ఒక్క‌డిని ప‌ట్టుకుని ప‌ది మంది కొడ‌తారా?. రాహుల్‌కి రాజీప‌డే ఉద్దేశం లేదు. ఈ ఘ‌ట‌న‌ని సీరియ‌స్‌గా తీసుకోమ‌ని క‌మీష‌న‌ర్‌తో చెబుతా. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తుల్ని ఎవ‌రుప‌స‌డితే వారొచ్చి కొట్టేస్తారా? అంటూ ప్ర‌శ్నించారు.

- Advertisement -

ఇద్ద‌రి మ‌ధ్య ఏమైనా గొడ‌వ‌లు వుంటే మాత్రం కొట్టేస్తారా?. కూర్చుని మాట్లాడుకోండి. న్యాయం కోసం పోరాడాల‌న్న‌దే త‌న ఉద్దేశ‌మ‌ని ఈ సంర్భంగా ప్ర‌కాష్‌రాజ్ స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ ఛీఫ్ విప్ విన‌య్ భాస్క‌ర్‌ని అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో క‌లిసి ప‌రిస్థితిని వివ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై ఇటీవ‌ల రాహుల్ సిప్లిగంజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా మంత్రి కేటీఆర్‌కు వీడియో పుటేజ్‌ని ట్యాగ్ చేసి విన్న‌వించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All