Homeఎక్స్ క్లూసివ్ప్రకాష్ రాజ్ టీఆర్ఎస్ తరుపున పోటీ చేయనున్నాడా ?

ప్రకాష్ రాజ్ టీఆర్ఎస్ తరుపున పోటీ చేయనున్నాడా ?

Prakash Raj contesting on TRS ticket
Prakash Raj and KTR

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే . అయితే నిన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలవడంతో టిఆర్ఎస్ తరుపున పార్లమెంట్ కు పోటీ చేయనున్నాడా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి . కొంతకాలంగా ప్రకాష్ రాజ్ టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సన్నిహితంగా మెలుగుతున్నాడు అలాగే కేటీఆర్ తో కూడా . కర్ణాటక ఎన్నికల సందర్బంగా మరింతగా బలపడింది ఈ బంధం  . ఇక ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తన మద్దతు ప్రకటించాడు ప్రకాష్ రాజ్ .

అయితే మొన్న ట్వీట్ చేసిన సారాంశం ఏంటంటే …… పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాడు కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అంటే మాములు విషయం కాదు , విజయం సాధ్యం కాదు కూడా అందుకే కేటీఆర్ తో భేటీ రాజకీయ ప్రాధాన్యత ని సంతరించుకుంది . ప్రకాష్ రాజ్ మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు దాంతో తెలంగాణ నుండి అందునా టీఆర్ఎస్ నుండి పార్లమెంట్ కు పోటీ చేసినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది . అయితే పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున కొద్దిరోజుల్లోనే మరింత క్లారిటీ రానుంది .

- Advertisement -

English Title: Prakash Raj contesting on TRS ticket

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All