Homeటాప్ స్టోరీస్తెలుగు వాడ్ని గెలిపించుకున్నారు, అతిథిగానే ఉంటాను - ప్రకాష్ రాజ్

తెలుగు వాడ్ని గెలిపించుకున్నారు, అతిథిగానే ఉంటాను – ప్రకాష్ రాజ్

prakash raj and nagababu resigns membership from MAA 
prakash raj and nagababu resigns membership from MAA

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఓటమి అనంతరం ప్రకాష్ రాజ్ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. “మా అసోసియేషన్ లో బయటి వాడు ఓటు వేయొచ్చు కానీ పోటీ చేయకూడదు అన్నారు. సంతోషం. మీ తెలుగు వాడ్ని గెలిపించుకున్నారు. మంచిది. మంచు వారు గెలిచారు, అభినందనలు. తెలుగు వాడే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండాలన్నారు. అలా అన్నప్పుడు నేను మా లో ఎందుకు సభ్యుడిగా ఉండాలి. నాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీకి అతిథిగానే ఉంటాను.

మా సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నా. నాకు దర్శకులకు, నిర్మాతలకు, రచయితలకు, నటులకు, ప్రేక్షకులకు బంధం అలానే ఉంటుంది. సినిమాలు చేస్తాను. నేను ఒక కళాకారుడిని. అయితే బయటవాడిగానే సినిమాలు చేస్తాను. నేను తెలుగు వాడ్ని కాకపోవడం నా తప్పు కాదు, నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు, ఏం చేస్తాం. అది వారి తప్పు కూడా కాదు. నేను ఇదేదో బాధతో, పెయిన్ తో చెప్పట్లేదు, మీకు కావాల్సింది అదే కదా. గెలిచిన అందరికీ కృతఙ్ఞతలు” అని ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లో తెలిపారు.

- Advertisement -

ఈరోజు ఉదయమే నాగబాబు కూడా మా సభ్యత్వాన్ని రద్దు చేసుకున్న విషయం తెల్సిందే. “ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక మా అసోసియేషన్ లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు” అని నాగబాబు స్టేట్మెంట్ ను విడుదల చేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All