Homeప్రెస్ నోట్స్ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ ఫస్ట్ లుక్, ప్రోమో విడుదల

ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ ఫస్ట్ లుక్, ప్రోమో విడుదల

Prajwal Devaraj’s Karavali First Look & Promo Unveiled
Prajwal Devaraj’s Karavali First Look & Promo Unveiled

డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ సినిమాతో అందరినీ పలకరించబోతున్నారు. ‘అంబి నింగే వయసైతో’ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గనిగ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్‌ బ్యానర్ మీద గురుదత్త గనిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కరావళి అనే గ్రామంలో కంబాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ఈ 40వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ప్రోమోలను నేడు విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో ప్రజ్వల్ దేవరాజ్ ఇది వరకెన్నడూ కనిపించని లుక్కులో కనిపించబోతున్నారు. మహిషా అవతారం అన్నట్టుగా అలా మహిషం మీద కదిలి వచ్చే సీన్ చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే.

- Advertisement -

ఓ వైపు గేదె ప్రసవం, మరో వైపు హీరో జననం.. ఈ రెండింటికి ఏదో లింక్ ఉన్నట్టుగా చూపించడం.. చివరకు హీరో కాస్తా మహిషాసురుడు అయ్యాడన్నట్టుగా వెరైటీ గెటప్‌లో కనిపించే షాట్ అదిరిపోయింది. చూస్తుంటే పాన్ ఇండియాకు పర్‌ఫెక్ట్ సబ్జెక్ట్ అన్నట్టుగా కనిపిస్తోంది. విజువల్స్, ఆర్ఆర్ కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి.

మా భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, మా మూలల్లోంచి కథలు తీసుకుని తెరపై ఆవిష్కరించాలని అనుకుంటున్నామని దర్శక నిర్మాత గురుదత్త గనిగ తెలిపారు.

ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. అభిమన్యు సదానందన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లోకి రానుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All