Homeటాప్ స్టోరీస్ప్ర‌భాస్ ఇంత సాహ‌సం ఎందుకు చేస్తున్నాడు?

ప్ర‌భాస్ ఇంత సాహ‌సం ఎందుకు చేస్తున్నాడు?

ప్ర‌భాస్ ఇంత సాహ‌సం ఎందుకు చేస్తున్నాడు?
ప్ర‌భాస్ ఇంత సాహ‌సం ఎందుకు చేస్తున్నాడు?

ప్ర‌పంచం మొత్తం క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా బెంబేలెత్తిపోతుంటే ప్ర‌భాస్ అండ్ యువీ టీమ్ మాత్రం అస్స‌లు జంక‌డం లేదు. ఇటీవ‌ల ప్ర‌భాస్‌, హీరోయిన్ పూజా హెగ్డే, చిత్ర యూనిట్ ఇట‌లీ నేప‌థ్యంలో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం అక్క‌డికి వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఓ ఛేజింగ్ సీన్‌ని పూర్తి చేశామ‌ని, త‌దుప‌రి అక్క‌డే ఓ భారీ షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామ‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది యువీ టీమ్‌.

`బాహుబ‌లి` కోసం రాజ‌మౌళి మ‌హిష్మ‌తి సామ్రాజ్యాన్ని సృష్టిస్తే ప్ర‌భాస్ 20 కోసం ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ కొత్త ప్ర‌పంచాన్ని క్రియేట్ చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ద‌ర్శ‌కుడు వెల్ల‌డించ‌డంతో ఈ సినిమాపై స‌ర్వ‌త్రా భారీ అంచ‌నాలే ఏర్పడ్డాయి. తాజాగా ఇటీలీ వెల్లిన ఈ చిత్ర టీమ్ జార్జియాలో ఓ భారీ షెడ్యూల్‌ని షూట్ చేయ‌బోతోంది. ఇందు కోసం ఓ భారీ మ‌ర్కెట్ సెట్‌ని సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. అక్క‌డ క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నా ప్ర‌భాస్ టీమ్ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా షూటింగ్ చేస్తుండ‌టం వ‌ర‌ల్డ్ వైడ్‌గా వున్న ఫిల్మ్ మేక‌ర్స్‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

- Advertisement -

ఇప్ప‌టికే `సాహో` కార‌ణంగా ఆల‌స్యం అయిన ఈ చిత్రాన్ని అనుకున్న స‌మ‌యానికి రిలీజ్ చేయాల‌ని ప్ర‌భాస్ స్పీడు పెంచార‌ట‌. అందుకే క‌రోనాని కూడా లెక్క‌చేయ‌కుండా సినిమాని పూర్తి చేయాల‌ని డేర్‌గా ముంద‌డుగు వేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అదీ కాకుండా త్వ‌ర‌లో నాగ్ అశ్విన్ సినిమా ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని త్వ‌ర‌గా పూర్తి చేసి ఆ సినిమాకు సిద్ధంగా వుండాల‌ని తొంద‌ర‌ప‌డుతున్నాడ‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All