Homeటాప్ స్టోరీస్ఏడాది పూర్తిచేసుకున్న బాహుబలి 2

ఏడాది పూర్తిచేసుకున్న బాహుబలి 2

prabhas tweets on baahubali 2 completes one year సరిగ్గా ఈరోజుకి ప్రభాస్ నటించిన బాహుబలి 2 విడుదలై ఏడాది అయ్యింది దాంతో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఫేస్ బుక్ కి ఎక్కాడు ప్రభాస్ . ” బాహుబలి 2 సినిమా విడుదలై సంవత్సరం పూర్తయ్యింది , ఈరోజు ఎప్పటికి నాకు స్పెషల్ ….. భావోద్వేగ ప్రయాణంలో నేను ఒక భాగమైనందుకు దర్శకులు రాజమౌళి కి బాహుబలి చిత్ర యూనిట్ కు నా కృతజ్ఞలతో పాటు శుభాకాంక్షలు ” అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు ప్రభాస్ . బాహుబలి సంచలన విజయం సాధించగా బాహుబలి 2 చరిత్ర సృష్టించింది .

బాహుబలి సిరీస్ లలో వచ్చిన రెండు చిత్రాలతో ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగింది . బాహుబలి కి ముందు ఒక్క తెలుగు వరకే పరిమితమయ్యాడు ప్రభాస్ కానీ బాహుబలి తర్వాత అతడి రేంజ్ విశ్వవ్యాపితం అయ్యింది . బాహుబలి కోసం ఏకంగా ఐదేళ్లు కష్టపడ్డాడు ప్రభాస్ , అన్నేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది దాంతో చాలా సంతోషంగా ఉన్నాడు . ఈరోజు కి బాహుబలి 2 రిలీజ్ అయి ఏడాది కాగా జపాన్ లో రిలీజ్ అయి వంద రోజులు నిన్ననే పూర్తిచేసుకుంది బాహుబలి 2 . ఇక ఇప్పుడేమో చైనాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All