Homeటాప్ స్టోరీస్సాహో ని కంప్లీట్ చేస్తున్న ప్రభాస్

సాహో ని కంప్లీట్ చేస్తున్న ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహూ ని పూర్తిచేసే పనిలో ఉన్నాడు . ప్రస్తుతం ఈ సినిమా భారీ షెడ్యూల్ ముంబై లో జరుగుతోంది . రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తోంది . జాకీ ష్రాఫ్ , మందిరా బేడీ , నీల్ నితిన్ ముఖేష్ , వెన్నెల కిషోర్ , అరుణ్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ – ప్రమోద్ లు నిర్మిస్తున్నారు .

- Advertisement -

అయితే ఈ సినిమా షూటింగ్ ముంబై లోనే ప్రారంభమైంది , దాంతో ముంబై లోనే షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు . ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది . యాక్షన్ సీన్స్ ని భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు . ఈ షెడ్యూల్ తో సినిమా కంప్లీట్ అవుతుంది , ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వరితగతిన పూర్తిచేసి ఆగస్టు 15 న సాహూ ని విడుదల చేయనున్నారు . బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పట్ల అటెన్షన్ నెలకొంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All