
బాహుబలి , సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ డైరెక్ట్ చేయగా యువీ క్రియేషన్స్ వారు నిర్మించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా వల్ల నిర్మాతలు ఏమి నష్టపోలేదు కానీ బయ్యర్లు మాత్రం నష్టపోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం యు.వి.క్రియేషన్స్ భారీగా నష్టపోయిన బయ్యర్లకు ఎంతో కొంత డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముందుగానే ప్రభాస్ ఆ విషయంలో నిర్మాతలకు సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. భారీగా నష్టపోయిన వారికి ఎంతోకొంత ఇవ్వాలి అని కూడా అన్నాడట. ఇక ప్రభాస్ తన పారితోషికంలో సగానికిపైగా వెనక్కి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిలిం నగర్ సమాచారం మేరకు దాదాపు రూ. 50 కోట్ల వరకు ప్రభాస్ వెనక్కు ఇస్తున్నట్లు చెపుతున్నారు.