Homeఎక్స్ క్లూసివ్ఆర్ ఆర్ ఆర్ లో ప్రభాస్ నిజమేనా ?

ఆర్ ఆర్ ఆర్ లో ప్రభాస్ నిజమేనా ?

Is Prabhas to play Cameo in Rajamouli RRR?రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ”. ఎన్టీఆర్ – రాంచరణ్ లు హీరోలుగా నటిస్తుండటంతో ఈ చిత్రానికి ఎనలేని క్రేజ్ వచ్చింది అయితే దానికి కొనసాగింపుగా రెబల్ స్టార్ ప్రభాస్ ని కూడా యాడ్ చేస్తున్నారని జోరుగా కథనాలు వినిపిస్తున్నాయి . ఎన్టీఆర్ , రాంచరణ్ లకు తోడు ప్రభాస్ కూడా ఆర్ ఆర్ ఆర్ లో భాగమైతే ఆ సంగతి వేరే చెప్పాలా ? సినిమా రేంజ్ ని ఊహించలేం . ఫ్యాన్స్ అయితే పూనకంతో ఊగిపోవడం ఖాయం.

అయితే ప్రస్తుతమైతే ఊహాగానాలు మాత్రమే వినబడుతున్నాయి , అది నిజమా ? కాదా ? అన్నది మాత్రం జక్కన్న చెప్పాల్సిందే . ప్రభాస్ ని గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వాల్సిందిగా మాత్రం కోరారట జక్కన్న . ఎన్టీఆర్ , చరణ్ లంటే ప్రభాస్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది అలాగే జక్కన్న ఆర్డర్ వేయాలే కానీ నో అంటాడా ప్రభాస్ . ఎన్టీఆర్ చరణ్ లకు ప్రభాస్ తోడైతే ఆ ఊపే వేరు .

English Title: Is  Prabhas to play Cameo in Rajamouli RRR?
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All