
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకున్నారు. రాధే శ్యామ్ రిలీజ్ రోజున గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్ థియేటర్ వద్ద ఒక బ్యానర్ కడుతూ చల్ల కోటేశ్వరరావు అనే అభిమాని ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్..అభిమాని మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ..ఆయన కుటుంబానికి రెండు లక్షల ఆర్ధిక సాయం అందజేశారు.
ప్రభాస్ – రాధాకృష్ణ కలయికలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్..శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. పూర్తీ గా క్లాస్ మూవీ కావడం , ప్రభాస్ క్లాస్ గా కనిపించడం , సినిమా కు స్లో గా సాగడం వల్ల చాలామందికి నచ్చలేదు. దీంతో సినిమా కు మొదటి రోజు మొదటి షో తోనే మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్లు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అని అంటున్నారు.