Homeటాప్ స్టోరీస్సూప‌ర్ స్టైలిష్ విక్ర‌మాదిత్య!

సూప‌ర్ స్టైలిష్ విక్ర‌మాదిత్య!

సూప‌ర్ స్టైలిష్ విక్ర‌మాదిత్య!
సూప‌ర్ స్టైలిష్ విక్ర‌మాదిత్య!

రాధే శ్యామ్’ బృందం ప్రభాస్ పుట్టినరోజుకు ముందే స్మాల్ స‌ర్‌ప్రైజ్‌ని రిలీజ్ చేసేసింది. శుక్ర‌వారం ప్రభాస్ పుట్టిన రోజు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు `రాధేశ్యామ్‌` మూవీ నుంచి `బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్‌` పేరుతో మోష‌న్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి `డియ‌ర్ కామ్రేడ్‌` ఫేమ్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందిస్తున్న విష‌యం తెలిసిందే.

త‌న‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఫైన‌ల్ చేసిన‌ట్టు చిత్ర బృందం ఇటీవ‌లే అధికారికంగా ప్ర‌క‌టించింది. దీంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్యాన్స్‌లో ప్ర‌త్యేక ఆస‌క్తి మొద‌లైంది. ఇదిలా వుంటే చిత్ర బృందం ప్ర‌భాస్ బ‌ర్త్‌డేకి టు డేస్ ముందే ప్ర‌భాస్ అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చేసింది. ఈ మూవీలో ప్ర‌భాస్ పోషిస్తున్న స్టైలిష్ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ని రిలీజ్ చేశారు.

- Advertisement -

ఇందులో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ పేరు విక్ర‌మాదిత్య‌. మేక‌ర్స్ రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌లుక్‌లో ప్ర‌భాస్ ఉబ‌ర్ కూల్ గా మ‌రింత స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు. `బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్‌` ‌ కొద్దిసేపటి క్రితం వారు ప్రభాస్ యొక్క రూపాన్ని మరియు పాత్రను సినిమా నుండి ఆవిష్కరించారు. విక్రమాదిత్య వలె, ప్రభాస్ ఉబెర్ కూల్ గా కనిపిస్తాడు మరియు అతని దుస్తులు సూపర్ స్టైలిష్ గా ఉంటాయి. ఓల్డ్ మోడ‌ల్ కార్ల మ‌ధ్య ఓ కార్‌పై స్లైలిష్ లుక్‌లో కూర్చుని ప్ర‌భాస్ క‌నిపిస్తున్న తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All