
రాధే శ్యామ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్..త్వరలో మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ లో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు భామలు నటిస్తున్నట్లు సమాచారం. వీరిలో మాళవిక మోహన్ , కృతి శెట్టిలను ఎంపిక అయ్యారని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటె ఈ మూవీ కోసం ఓ భారీసెట్‌ని తీర్చిదిద్దే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు. హైదరాబాద్‌లోనే రూ.5 కోట్లకు పైగా వ్యయంతో ఓ ఇంటి సెట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారట. అందులోనే ఎక్కువ శాతం షూటింగ్ జరగనుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ చిత్రాన్ని పూర్తి చేసాడు. అలాగే సలార్ మూవీ సెట్స్ ఫై ఉంది.
- Advertisement -