Homeటాప్ స్టోరీస్తనకు పెళ్లి కాకపోవడానికి కారణం అదే అంటూ ఫస్ట్ నోరు విప్పిన ప్రభాస్

తనకు పెళ్లి కాకపోవడానికి కారణం అదే అంటూ ఫస్ట్ నోరు విప్పిన ప్రభాస్

Prabhas interesting comments on his wedding
Prabhas interesting comments on his wedding

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పిలవబడే ప్రభాస్ ఫస్ట్ టైం తనకు పెళ్లి కాకపోవడానికి కారణం ఏంటో తెలిపాడు. వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ కెరియర్ ను జెట్ స్పీడ్ గా తీసుకెళ్తున్న ప్రభాస్..పెళ్లి మాత్రం చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉండిపోతున్నాడు. ఈ ఏడాదైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడేమో..అనుకుంటూ అభిమానులు ఏళ్లు గడుపుతున్నప్పటికీ ప్రభాస్ మాత్రం పెళ్లి ఫై ఏమాత్రం ఇంట్రస్ట్ చూపించడం లేదు. తాజాగా తనకు పెళ్లి కాకపోవడానికి కారణం అదే కావొచ్చు అంటూ మీడియా ముందు నోరు విప్పాడు.

ప్రస్తుతం ప్రభాస్ ..జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో రాధే శ్యామ్ మూవీ చేసాడు. గత మూడేళ్లు గా ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తూ..ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 11 న ఈ మూవీ పలు భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్ లో భాగంగా మంగళవారం చిత్ర రిలీజ్ ట్రైలర్ ను ముంబై లో గ్రాండ్ గా విడుదల చేసారు. ఈ కార్య క్రమానికి ప్రభాస్, పూజా హగ్దే లతో పాటు డైరెక్టర్ , నిర్మాతలు హాజరయ్యారు. ట్రైలర్ లో ‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు’ అని చెప్పే డైలాగ్ అందరినీ బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా వారు ప్రభాస్ వద్ద దీని గురించి ప్రస్తావించారు. రియల్ లైఫ్ లో ప్రేమ విషయంలో ఎన్ని సార్లు మీ ప్రిడిక్షన్ తప్పింది? అని ప్రభాస్ ను ప్రశ్నించగా.. ”చాలా సార్లు జరిగింది.. అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటా” అని నవ్వుతూ జవాబు ఇచ్చాడు. ఒక్కసారిగా ప్రభాస్ తన పెళ్లి గురించి కామెంట్ చేయడంతో అక్కడ అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All