
`బాహుబలి` తరువాత నుంచి ప్రభాస్ స్థాయి మారిపోయింది. ఏ సినిమా చేసిన పాన్ ఇండియా స్థాయిలో వుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీకృష్ఞా మూవీస్ సమర్పణలో యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీ చిత్రీరకరణ దశలో వుంది.
కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు ఏర్పడిన తరువాత చిత్రీకరణ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమా తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని ప్రభాస్ చేస్తున్న విషయం తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కునున్న సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వనీదత్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి గానూ ప్రభాస్ తీసుకుంటున్న పారితోషికం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఈ చిత్రానికి ప్రభాస్ వంద కోట్లు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి గానూ ప్రభాస్ 70 కోట్ల పారితోషికం, దబ్బింగ్ రైట్స్‌కు గానూ 30 కోట్లు మొత్తం గా 100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. ఈ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న భారతీయ నటుల్లో ప్రభాస్ నిలవడం గమనార్హం. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితం కానున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రారంభం కానుంది. 2020 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట.