
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఆది పురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ 3డీ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈమూవీని రామాయణ ఇతిహాసం ఆధారంగా మోడ్రన్ రామాయణంగా అత్యంత భారీ స్థాయిలో భారతీయ తెరపై కనీ వినీ ఎరుగని విధింగా తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈ మూవీలో లంకాధిపతి రావణ్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ఈ క్రమంలో ఈ చిత్రం నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్ గా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ అయ్యింది. దీంతో అభిమానులు తీవ్ర బాధలో ఉన్నారు. ఆ బాధలో నుండి అభిమానులను బయటకు తీసుకొచ్చేందుకు ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ను ఏప్రిల్ 10 న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆదిపురుష్ సినిమాను ఇతర దేశాల్లో వివిధ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది