Homeటాప్ స్టోరీస్ప్రభాస్ 25 స్పిరిట్.. బిగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది..!

ప్రభాస్ 25 స్పిరిట్.. బిగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది..!

యంగ్ రెబల్ స్టార్ నుండి మరో బిగ్ ఎనౌస్ మెంట్ వచ్చేసింది. ప్రభాస్ 25వ సినిమాగా సందీప్ వంగ డైరక్షన్ లో స్పిరిట్ అనే సినిమా ఎనౌన్స్ చేశారు. టీసీరీస్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రానుంది. ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యాం, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K, సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో వస్తుండగా లేటెస్ట్ గా స్పిరిట్ అంటూ సందీప్ వంగతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న ప్రభాస్ సందీప్ వంగతో చేస్తున్న స్పిరిట్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం రాధే శ్యాం సినిమా పూర్తి చేసిన ప్రభాస్ ఆదిపురుష్, సలార్ రెండు సినిమాలను చేస్తున్నాడు.

- Advertisement -

ఇక అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ సెన్సేషనల్ అనిపించుకున్న డైరక్టర్ సందీప్ వంగ ప్రభాస్ లాంటి నేషనల్ లెవల్ హీరోతో సినిమా చేయడం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. క్రేజీ సినిమాలతో ప్రభాస్ వస్తుండగా ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తప్పకుండా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా రికార్డుల మీద రికార్డులు కొడతాడు అన్నది మాత్రం నిజమని చెప్పొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All