
అక్షయ్ కుమార్, విద్యాబాలన్ , తాప్సీ పన్ను , సోనాక్షి సిన్హా , కీర్తి కుల్హరి , నిత్యామీనన్ తదితరులు నటించిన ” మిషన్ మంగళ్ ” చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.
అసలు ఈ సినిమా రేపు విడుదల అవుతోంది , అయితే ఈరోజే పలువురు సినీ , రాజకీయ ప్రముఖులకు ప్రీమియర్ షో వేశారు ముంబైలో.
ఇక ఈ షో చూసిన వాళ్ళు మిషన్ మంగళ్ లో నటించిన నటీనటులను , దర్శక నిర్మాతలను అభినందిస్తున్నారు.
ఇక ఈ సినిమాని చూసిన కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి.
కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.
మిషన్ మంగళ్ చిత్రం నాకు చాలా బాగా నచ్చిందని , అద్భుతమైన సినిమా అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశాడు.
కిషన్ రెడ్డి మాత్రమే కాదు పలువురు సినీ ప్రముఖులు కూడా మిషన్ మంగళ్ బాగుందని అంటున్నారు.
అయితే అసలు తీర్పు మాత్రం రేపు ప్రేక్షకులు ఇవ్వనున్నారు.