Homeటాప్ స్టోరీస్ఛలో చిత్రానికి పాజిటివ్ టాక్

ఛలో చిత్రానికి పాజిటివ్ టాక్

Positive talk to nagashourya chaloయంగ్ హీరో నాగశౌర్య – రష్మీక జంటగా నటించిన చిత్రం ఛలో. వెంకి కుడుముల దర్సకత్వంలో నాగశౌర్య తల్లిదండ్రులు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. నాగశౌర్య మార్కెట్ ని మించి ఎక్కువ ఖర్చుపెట్టారు అయితే లక్కీ గా మంచి బిజినెస్ జరగడంతో నాగశౌర్య తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. ఇక ఈ సినిమా ఈరోజు విడుదల అయ్యింది కానీ నిన్న రాత్రి ఇండస్ట్రీలో ని పలువురు సినీ ప్రముఖులకు ప్రత్యేక షో వేశారు.
ఆ షో టాక్ ప్రకారం నాగశౌర్య ఛలో చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. కథ పాతదే అయినప్పటికీ కొత్త దర్శకుడు వెంకీ కుడుముల స్క్రీన్ పై చేసిన మ్యాజిక్ బాగానే పనిచేసిందని అంటున్నారు. నాగశౌర్య నటన , రష్మీక గ్లామర్ , త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ వెరసి ఛలో హిట్ అని అంటున్నారు. మొత్తానికి సొంత చిత్రం తీసి దెబ్బ తినకుండా హిట్ కొట్టి లక్కీ ఫెల్లో అయ్యాడు నాగశౌర్య.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All